Leo Movie First Single | లియో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’లో భాగంగా సినిమా తెరకెక్కున్నట్లు వార్తలు రావడంతో లియోపై ఎక్కడలేని హైప్ పెరిగింది. దానికి తోడు విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ సైతం మిలియన్లలో వ్యూస్‌ను సాధించి.. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
‘నా రెడీ’ అంటూ సాగే మాస్ బీట్‌ను జూన్ 22న విజయ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. నోట్లో సిగరెట్ పెట్టుకుని, చేతిలో గన్ కాల్చినట్లు ఉన్న స్టిల్ అదిరిపోయింది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. దసరాను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీలైనంత తర్వగా షూటింగ్ పూర్తి చేసి ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ అయిపోవాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.లలిత్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
First Single #NaaReady on @actorvijay Anna’s Birthday #Leo 🔥🧊 pic.twitter.com/xG5T46GWyR
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 16, 2023