శ్రద్దాదాస్ (Shraddha Das)..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామకు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లున్న విషయం తెలిసిందే. ఎప్పటికపుడు ట్రెండీ, రొమాంటిక్, హాట్ డ్రెస్సుల్లో దర్శనమిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఈ భామ ప్రస్తుతం లేచింది మహిళా లోకం (Lechindi Mahila Lokam) సినిమాతో బిజీగా ఉంది. సినిమా సెట్స్ లో తీసిన ఫన్నీ వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కోస్టార్లు లక్ష్మి మంచు (Lakshmi Manchu), అనన్య నాగళ్ల, హరితేజ, సుప్రితతో కలిసి తీసిన వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది.
వీరంతా ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఇంతకీ అదేంటనుకుంటున్నారా..? మొబైల్ నెట్ వర్క్ (Mobile network) రావడం లేదట. సినిమా లొకేషన్లో ప్రతీ రోజూ నెట్ వర్క్ కోసం ప్రయత్నిస్తున్న స్టోరీ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అర్జున్ అండ్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శృతిరంజని మ్యూజిక్ డైరెక్టర్.