అలనాటి అందాల తార లయ (laya Gorty) సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉన్నా..నెట్టింట మాత్రం ఏదో అప్డేట్తో అందరితో టచ్‌లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఏదో ఒక ట్రాక్‌కు డ్యాన్స్ చేసి ఔరా అనిపిస్తుంటుంది లయ. తాజా మరో ట్రాక్‌కు యూఎస్ వీధుల్లో డ్యాన్స్ చేసి అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది లయ. ఇంతకీ ఈ భామ ఈ సారి ఏ పాటకు డ్యాన్స్ చేసిందనే కదా మీ డౌటు.
రీసెంట్గా వచ్చిన అంటే సుందరానికి సినిమా ప్రమోషన్ సాంగ్. యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) వద్ద ఈ ట్రాక్‌కు తన పార్ట్నర్తో కలిసి (Ante Sundaraniki hook step) స్టెప్పులేసి అదరహో అనిపిస్తోంది. సిటీ వాక్-యూనివర్సల్ స్డూడియోస్ వద్ద ఈ ట్రెండింగ్ ట్రాక్‌ను ప్రయత్నించా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోకు కామెంట్లు, లైక్స్ వర్షంలా కురుస్తున్నాయి.
ఈ సీనియర్ నటి ఇంతకీ మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా..? అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కు రాబోయే రోజుల్లో ఏదైనా అప్ డేట్ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే లయ తన స్నేహితులతో కలిసి ట్రెండీ పాటలతో నెట్టింట పోస్ట్ చేసే వీడియోలకు సూపర్ క్రేజ్ ఉంటుంది.
Read Also : Remunerations | Mega 154 క్రేజీ టాక్..బడ్జెట్లో అగ్రభాగం రెమ్యునరేషన్లకే..?
Read Also : Kesariya Song | బ్యూటిఫుల్ ‘కేసరియా’ మెలోడీ లవ్ ట్రాక్ వచ్చేసింది..