లావణ్య త్రిపాఠి, దేవ్‌మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకుడు. దుర్గాదేవి పిక్చర్స్ పతాకంపై నాగమోహన్ నిర్మించారు. గురువారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. మార్చి 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిదని, కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తిచేశామని చెప్పింది.
కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రమిదని దర్శకుడు తాతినేని సత్య పేర్కొన్నారు. భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత నాగమోహన్ తెలిపారు. నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, జాఫర్ సాదిక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బినేంద్ర మీనన్, సంగీతం: మిక్కీ జే మేయర్, దర్శకుడు: తాతినేని సత్య.