నిండు నూరేళ్ల అదృష్టం!
మాది బెంగళూరు. అమ్మ కన్నడ వనిత. నాన్న మహారాష్ట్ర వ్యక్తి. అలా, కన్నడ-మరాఠీ భాషల మీద పట్టు వచ్చేసింది. తెలుగు నేర్చుకోడానికి మాత్రం కొంత సమయం పట్టింది. ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా చేశాను.
ఎవరైనా కథానాయిక పాత్రలు కలగంటారు. హీరోయిన్ క్యారెక్టర్లో హీరోతో ప్రేమాయణం నడపాలని, కోడలుపిల్లగా అత్త పాత్ర అభిమానం సంపాదించాలని కోరుకుంటారు. జీ తెలుగు ‘నిండు నూరేళ్ల సావాసం’లో కీలక పాత్ర పోషిస్తున్న లావణ్య రావ్ మాత్రం ప్రతినాయికగానే పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. ఆ కన్నడ కాంత చిన్నతెర ప్రయాణం ఆమె మాటల్లోనే..
మాది బెంగళూరు. అమ్మ కన్నడ వనిత. నాన్న మహారాష్ట్ర వ్యక్తి. అలా, కన్నడ-మరాఠీ భాషల మీద పట్టు వచ్చేసింది. తెలుగు నేర్చుకోడానికి మాత్రం కొంత సమయం పట్టింది. ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా చేశాను. తెలుగులో ‘ముత్యాల ముగ్గు’ సీరియల్‌తో నా చిన్నతెర కెరీర్ ప్రారంభమైంది. అందులో నాది నెగెటివ్ రోల్. మధ్యలో ‘రామసక్కని సీత’ చేశాను. ‘ముక్కుపుడక’ చేస్తున్నాను. నెగెటివ్ రోల్ ఇచ్చే కిక్కే వేరు. నిజానికి మనోహరి పాత్రను మహేశ్వరి అనే నటి చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారామె. ముందు నుంచీ నేను ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ ఫాలో అవుతున్నాను. ఆ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుంది? అనుకునేదాన్ని. అంతలోనే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మేకప్ వేసుకుంటున్నప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో!
నాన్న.. రావణుడు
నాన్న మంచి నటుడు. నాటకాల్లో ఆయన రావణాసురుడి పాత్ర ధరిస్తే.. దశకంఠుడే స్టేజీ మీదికి వచ్చిన భావన కలిగేది. నాన్న వికటాట్టహాసం చేస్తుంటే.. నేను, చెల్లి భయపడి ఏడ్చేవాళ్లం. అంత గాంభీర్యం, అంత సహజత్వం. అమ్మ స్టాఫ్‌నర్స్. నాకో చెల్లి ఉంది. నాన్న మరణం తర్వాత అమ్మే మా సర్వస్వం. చిన్నతెర వైపుగా నా ప్రయాణం మాత్రం యాదృచ్ఛికంగానే మొదలైంది. అప్పట్లో ఓ రియాలిటీ షో చేశాను. అది చూసి నిర్మాతలు ముందుకొచ్చారు. అప్పటికే నేను ఎంకామ్ చదివాను. టీచింగ్‌లో స్థిరపడాలని కోరిక. కానీ చిన్నతెర తలుపు తట్టడంతో ఇటువైపు వచ్చాను. కన్నడలో మూడు ప్రాజెక్ట్‌లు చేశాను. ఆ పరిశ్రమ నాకు నటన నేర్పింది. డైలాగులు చెప్పడం బోధించింది. మా ఆయన ప్రోత్సాహమూ మరువలేనిది. మాది ప్రేమ వివాహం.
తెలుగువారికి థ్యాంక్స్..
తెలుగు పరిశ్రమకు వచ్చాక.. నా నటనలో పరిపక్వత వచ్చింది. తోటి నటులు, సాంకేతిక సిబ్బంది.. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రోత్సహిస్తారు. ప్రతినాయిక పాత్ర పోషించడంలో సమస్యలూ ఉంటాయి. ఓ సారి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్లినప్పుడు ఓ పెద్దావిడ నానా తిట్లూ తిట్టింది. ‘నువ్వూ మనిషివేనా? ఎదుటివాళ్లను బాధపెట్టి సంతోషిస్తావా?’ అంటూ మీదిమీదికి వచ్చింది. సహనటులు అడ్డుకోవడంతో సరిపోయింది. లేకపోతే, ఏమైపోయేదాన్నో? ఓ వైజాగ్ కుర్రాడైతే చేతిమీద నా మొహాన్ని టాటూగా వేయించుకున్నాడు. ఇలాంటి
అనుభవాలు అనేకం.
…? హరిణి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

