Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్‌సలామ్ (Lal Salaam). ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. లాల్ సలామ్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను షురూ చేసింది సూపర్ స్టార్ టీం. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించింది.
లాల్ సలామ్ ఫస్ట్ సింగిల్ THER THIRUVIZHAను రేపు సాయంత్రం 5 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ సాంగ్ లుక్ విడుదల చేసింది. సంప్రదాయ నృత్యంతో ఈ పాట ఉండబోతున్నట్టు హింట్ ఇవ్వగా.. తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రజినీకాంత్. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించింది.
లాల్‌సలామ్ చాలా రోజుల తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించాడని తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా రజినీకాంత్ అండ్ టీం అంతా ఒక్క చోట చేరి కేక్ కట్ చేసిందని తెలిసిందే. తలైవా, ఐశ్వర్య లాల్ సలామ్ యూనిట్‌తో సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్న స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతోపాటు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తలైవా 171లో కూడా నటిస్తున్నాడు.
Let the festivities begin! ☀️🌾✨ The 1st single ‘THER THIRUVIZHA’ from LAL SALAAM drops tomorrow at 5PM! 🕔
An @arrahman musical 🎶
Audio on @SonyMusicSouth 📼#LalSalaam 🫡 @rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @LycaProductions #Subaskaran… pic.twitter.com/90MDibzSt9— Lyca Productions (@LycaProductions) December 17, 2023
As the shoot 📽️ of #LalSalaam is completely wrapped, the team get together once again to rejoice it! 🤗✨ Off to the post-production now!#LalSalaam 🫡
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj… pic.twitter.com/znDsyIfuzH— Lyca Productions (@LycaProductions) August 9, 2023