Laggam | తెలంగాణ నేపథ్య కుటుంబకథాచిత్రం ‘లగ్గం’. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి ప్రధాన పాత్రధారులు. రమేశ్ చెప్పాల రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి వేణుగోపాల్‌రెడ్డి నిర్మాత. అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం రిలీజ్ డేట్ పోస్టర్ని హీరో సుధీర్‌బాబు విడుదల చేసి, టీమ్‌కి శుభాకాంక్షలు అందించారు. కుటుంబం అంతా కలిసి చూడాల్సిన చిత్రమిదని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆడపిల్ల తండ్రులు కూతుళ్లకి పెళ్లి చేసే ముందు ఈ చిత్రం చూడాలని ఎల్బీ శ్రీరామ్ తెలిపారు.