Film federation | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేసి బంద్ కొనసాగిస్తున్నారని తెలిసిందే. వర్కర్ల వేతనాలను 30 శాతం మేర పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా చిరంజీవితో ఓ వైపు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు, మరోవైపు నిర్మాతలు ఇప్పటికే విడివిడిగా సమావేశమయ్యారు. సినీ కార్మికుల సమ్మె, నిర్మాతల సమస్యలపై ఈ భేటీలో చర్చించారు.
ఇదిలా ఉంటే సినీ నిర్మాతలు, ఫెడరేషన్ వివాదంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫెడరేషన్‌కు లేబర్ కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. మెంబర్ షిప్ ఫీజులు, చందాల లెక్కలు ఇవ్వాలని, బ్యాంక్ బ్యాలెన్సులు, ఆడిట్ రిపోర్టులు, మినిట్స్ బుక్ ఇవ్వాలని ఫెడరేషన్‌ను లేబర్ కమిషన్ అడిగింది. అంతేకాదు మూడు రోజుల్లో అన్ని వివరాలతో ఫెడరేషన్‌కు లేబర్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Naga Chaitanya-Sobitha | తిరుమలలో శోభిత చేయి విడవని నాగ చైతన్య.. ఫొటోల కోసం ఎగబడ్డ భక్తులు
Dragon | తారక్ డ్రాగన్ కోసం స్పెషల్ హౌస్ సెట్.. ప్రశాంత్ నీల్ అదిరిపోయే ప్లాన్..!
SSMB 29 | ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఎస్ఎస్ రాజమౌళి కొత్త ప్రయోగం.. జంగిల్ సఫారీ రైడ్ అందుకేనా..?