Kushi Movie Re-relase | కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదూ. ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ‘ఖుషీ’ ఒకటి. అప్పటికే ఐదు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న పవన్‌కు ఈ సినిమా డబుల్ హ్యట్రిక్‌గా నిలిచింది. పవన్ డ్రెస్సింగ్ స్టైల్, హేయిర్ స్టైల్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో పవన్-భూమిక కెమిస్ట్రీకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. పేరుకు తమిళ దర్శకుడే అయిన.. ఎస్.జే సూర్య ఈ సినిమాను తెలుగు నెటీవిటీకి తగ్గట్లు మార్పులు చేసి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మణిశర్మ స్వర పరిచిన పాటలైతే ఇప్పటికి చెవులలో మార్మోగుతునే ఉన్నాయి. సినిమా రిలీజై 21ఏళ్ళయినా ఇప్పుడు చూసిన కొత్త ఫీల్ కలుగుతుంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 31న 4కే ప్రింట్‌తో పెద్ద ఎత్తున రీ-రిలీజ్ కానుంది.
ఖుషీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో పోకిరి రికార్డు బ్రేక్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఖుషీ సినిమాకు ఇప్పటి వరకు నైజాంలో కోటీ, ఆంధ్రాలో 65లక్షలు, ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షలు వచ్చాయి. టోటల్‌గా కోటీ 80లక్షలు వచ్చాయి. దాంతో పోకిరి రీ-రిలీజ్ ఫైనల్ కలెక్షన్లు(1.7 కోట్లు)ని ఖుషీ బ్రేక్ చేసింది. ఇక మిగిలింది జల్సా(3 కోట్లు) రికార్డే. అది కూడా రిలీజ్ రోజున ఎగిరిపోతుందని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎస్.జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏ.ఎం రత్నం నిర్మించాడు. పవన్‌కు జోడీగా భూమిక చావ్లా నటించింది.