Kushi | టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ చిత్రాల్లో ఒకటి ఖుషి (Kushi). విజయ్ దేవరకొండ (Vijay deverakonda), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఖుషి టైటిల్ సాంగ్ (Kushi Title song)ను లాంఛ్ చేశారు. ఖుషి నువ్ కనబడితే.. ఖుషి నీ మాట వినబడితే అంటూ సాగే ఈ పాటను శివనిర్వాణ రాశాడు.
మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ కంపోజిషన్‌లో స్వయంగా పాడాడు. అందమైన లొకేషన్లలో లవ్ ట్రాక్‌తో సాగుతున్న ఈ పాటకు బృందామాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. సినిమాకే హైలెట్‌గా నిలిచిపోయేలా పాట ఉండబోతున్నట్టు టైటిల్ ట్రాక్‌తో తెలిసిపోతుంది. బ్లూ డ్రెస్‌లో విజయ్ దేవరకొండ, ఏంజెల్ లుక్‌లో సామ్ కనిపిస్తూ.. ఏ మాయ చేశావే రోజులను మరోసారి గుర్తు చేస్తున్నారు.ఖుషి నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఖుషి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే (Na Rojaa Nuvve) నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఆరాధ్య సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు ఇప్పటివరకు వచ్చిన పాటలు చెబుతున్నాయి. ఖుషి చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
ఖుషి టైటిల్ సాంగ్..
నా రోజా నువ్వే..
ఆరాధ్య సాంగ్..
సామ్‌కు బై చెప్తూ..
Experience the Magic of Two Worlds Falling for Each Other ♥#Kushi in cinemas from 1st SEPTEMBER 2023 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/C2VGk6uJPz
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023