SJ Suryah | యాక్టర్‌గా, డైరెక్టర్‌గా తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి ఎస్జే సూర్య (SJ Suryah). డైరెక్టర్‌గా తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా ఖుషీ లాంటి ఆల్‌టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందించాడు ఎస్జే సూర్య. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుండే ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు సంబధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది.
అదేంటనే కదా మీ డౌటు. ఎస్జే సూర్య ఇన్స్టాగ్రామ్ (Instagram)లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్‌స్టా ఖాతా తెరిచిన కొద్ది సమయంలోనే 2వేల మందికిపైగా ఫాలోవర్లు యాడ్ అయ్యారు. ఇప్పటివరకు ట్విట్టర్ ద్వారా సినిమాలు,ఇతర అప్డేట్స్ ఇచ్చిన ఎస్జే సూర్య ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కొత్త అప్డేట్స్ అందించబోతున్నాడన్నమాట.
యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న మార్క్ ఆంటోనీ (Mark Antony) లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ పోషిస్తున్నాడు ఎస్జే సూర్య. దీంతోపాటు శంకర్-రాంచరణ్ కాంబోలో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ గేమ్ ఛేంజర్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్జే సూర్య మరోవైపు పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జిగర్తాండ డబుల్ ఎక్స్‌లో కీ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Sj Surya1
మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్..
మార్క్ ఆంటోనీ లొకేషన్లో సెలబ్రేషన్స్ ..
జిగర్తాండ 2 టీజర్…