చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. భారీ సాంకేతిక హంగులతో పంచభూతాల కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ భాగం కాబోతున్నారు. రంగ్ దే బసంతి, డాన్-2, డియర్ జిందగీ వంటి చిత్రాలతో కునాల్ కపూర్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె నాయుడు, సంగీతం ఎం.ఎం.కీరవాణి, రచన-దర్శకత్వం: వశిష్ట.