Sanjay leela Bhansali Next Flim | వాస్తవిక కథలను అందంగా, అందరికి అర్థమయ్యేట్టుగా తెరపై చూపించడంలో సంజయ్ లీలా భన్సాలీ సిద్ద హస్తుడు. ఈయన సినిమాలలో టేకింగ్ గాని, విజువలైజేషన్ గాని ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి. బాలీవుడ్లో పిరీయాడిక్ చిత్రాలను ఈయన కన్నా బాగా ఎవరు తెరకెక్కించలేరేమో అని అనిపిస్తుంది. ఇటీవలే ఈయన తెరకెక్కించిన ‘గంగూబాయి కతియావాడి’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికే తెలిసిందే. ఆలియా భట్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో వంద కోట్ల క్లబ్లో చేరింది. ఇదిలా ఉంటే భన్సాలీ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.
సంజయ్ లీలా భన్సాలీ తన తదుపరి చిత్రాన్ని రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ఆదిత్యకపూర్, కృతిసనన్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందట. రామ్‌లీలా, బాజీరావు మస్తానీ వంటి లవ్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించిన భన్సాలీ.. ఈ సారి ఎలాంటి థీమ్‌తో రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కిస్తాడా అని ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది.