ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు షాహిద్ కపూర్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కృతిసనన్ కథానాయిక. ‘అన్ ఇంపాజిబుల్ లవ్ స్టోరీ (అసాధ్యమైన ప్రేమకథ)’ ఉపశీర్షిక. ‘జర హట్ కే జర బచ్ కే’ వంటి లవ్‌స్టోరీని నిర్మించిన దినేష్ విజన్ అందిస్తున్న మరో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
మాడాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌జోషి-ఆరాధనా సాహ్ ద్వయం దర్శకత్వం వహించారు. యువతకు, కుటుంబ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభవంగా ఉంటుందని, న్యూఏజ్ రొమాంటిక్ మూవీగా ఆకట్టుకుంటుందని షాహిద్ కపూర్ తెలిపారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకులు తెలిపారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.