Karthi Next Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి ఇటీవలే విడుదలైన ‘సర్దార్’ వరకు ఈయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ వస్తున్నాయి. తెలుగులో కార్తికు టాలీవుడ్ టైర్2 హీరోలకున్నంత క్రేజ్ ఉంది. అయితే ‘ఖైదీ’ తర్వాత ఈయన నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ‘విరుమన్’,’PS-1′,’సర్దార్’ సినిమాలతో హాట్రిక్ విజయాలు సాధించాడు. ప్రస్తుతం కార్తి మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది. ఇక ఈ సినిమాలో కార్తికు జోడీగా కృతిశెట్టిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తుంది. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సింది. ఇక ఈ మధ్య కృతి నటించిన సినిమాలన్ని అటకెక్కుతున్నాయి. గతేడాది బంగార్రాజు మినహాయించి ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. ప్రస్తుతం కృతి ఆశలన్నీ కస్టడీ పైనే ఉన్నాయి. నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే12న ప్రేక్షకుల ముందుకు రానుంది.