తెలుగు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నది మంగళూరు సోయగం కృతిశెట్టి. ‘ఉప్పెన’ తర్వాత ఈ సొగసరికి టాలీవుడ్లో వరుస అవకాశాలు వరించినా.. అందులో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దాంతో గత రెండేళ్లుగా తెలుగు సినిమాలకు విరామం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ టాలీవుడ్లో బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది.
వెంకటేష్-కల్యాణ్‌రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో కృతిశెట్టి ఓ నాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఆమె కల్యాణ్‌రామ్ సరసన జోడీ కట్టబోతున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. వెంకటేష్‌కు జతగా కీర్తి సురేష్ నటించనుందని తెలుస్తున్నది. జూన్‌లో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.