మనోజ్ చంద్ర, మోనికటి, ఉషా బోనెల ప్రధాన పాత్రలు పోషించిన రూరల్ కామెడీ ఎంటైర్టెనర్ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ప్రవీణ పరుచూరి స్వీయ దర్శకత్వంలో గోపాలకృష్ణ పరుచూరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడు. పల్లెటూరి జీవితాలను, సరదాలను ఆవిష్కరించే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు.
రికార్డింగ్ డాన్స్ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా హీరో మనోజ్ చంద్ర ఈ సినిమాలో కనిపిస్తారని, డాన్స్ పార్టనర్ కోసం వెతుకుతున్న క్రమంలో అతను ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడని, ఆ సమస్యల నుంచి హీరో ఎలా బయట పడతాడు? అనేదే ఈ సినిమా కథ అని మేకర్స్ తెలిపారు. ఈ నెల 18న విడుదల కానున్న ఈ సినిమాలో రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు: గురుకిరణ్ బత్తుల, కెమెరా: పెట్రోస్ ఆంటోనియాడిస్, నేపథ్య సంగీతం: వరుణ్ ఉన్ని, నిర్మాణం: పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్.