Devara Movie | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవర. ఫస్ట్ రోజే నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.460 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సందర్భంగా దర్శకుడు కొరటాల శివ వరుస ఇంటర్వ్యూలలో పాల్గోంటున్నాడు. ఇక మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు తాజాగా దేవర పార్ట్ 2కి సంబంధించి అప్డేట్ ఇచ్చాడు శివ.
‘దేవర’ కంటే దేవర 2 ఇంకా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్ట్‌కి సంబంధించిన షూట్‌ని కొంతవరకు కంప్లీట్ చేశాం. ఇక దేవర ఫస్ట్ పార్ట్‌లో జాన్వీ పాత్ర తక్కువగా ఉందని అభిమానులు నిరాశ చెందినట్లు తెలిసింది. దేవర 2 లో జాన్వీ పాత్ర చాలా ఎక్కువే ఉంటుంది. అలాగే పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. జాన్వీ పాత్రని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. దేవరలో చూసింది 10 శాతమే. మిగతాది అంతా సెకండ్ పార్ట్‌లో ఉండబోతుంది అంటూ కొరటాల చెప్పుకోచ్చాడు. ఇక దేవర 2 సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం అక్టోబర్ లో మొదలుపెడతారని సమాచారం.