జాలారిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న చిత్రం ‘కొరమీను’. ఆనంద్ రవి కథానాయకుడిగా హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజారవీంద్ర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీపతి కర్రి దర్శకుడు. పెళ్లకూరు సామాన్యరెడ్డి నిర్మాత. శనివారం ఈ చిత్రం మోషన్‌పోస్టర్‌ను కథానాయిక లావణ్యత్రిపాఠి సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సరదాగా, ప్రేమగా ఉండే డ్రైవర్, అహంకారి ధనవంతుడు, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ఇలా మూడు ముఖ్యమైన పాత్రలతో, కొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పవన్‌కుమార్ జానా స్వామి,కథ-స్క్రీన్‌ప్లే: ఆనంద్వ్రి.