Cobra Movie | విక్రమ్ ‘కోబ్రా’ తెలుగు పోస్టర్ విడుదల
Cobra Movie Telugu Poster | చియాన్ విక్రమ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో ఈయనకు క్రేజ్ ఉంది. విక్రమ్ నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ఇటీవలే అమెజాన్‌లో నేరుగా విడుదలైన ‘మహాన్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. కోలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ఈ చిత్రం ఒకటి. అజయ్ జ్ణానముత్తు దర్శకత్వం వహించాడు. గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ఇస్తుంది. తాజాగా ఈ సినిమా తెలుగు పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన ‘కోబ్రా’ తెలుగు పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా సంస్థ విడుదల చేయనుంది. ఈ క్రమంలో మేకర్స్ ఎన్వీఆర్ సంస్థ కోబ్రా చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం సంతోషంగా ఉంది అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ప్రముఖ దిగ్గజ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.
We are elated to be associating with #NVRCinema for distribution of #Cobra in Andhra & Telangana !#ChiyaanVikram
An @AjayGnanamuthu Film 🎬
An @arrahman Musical 🥁@IrfanPathan@SrinidhiShetty7 @roshanmathew22 @mirnaliniravi @SonyMusicSouth #CobraFromAugust11 pic.twitter.com/tNU4q61GzD— Seven Screen Studio (@7screenstudio) July 2, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

