Leo Movie | ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ జనాలు జపిస్తున్న మంత్రం లియో. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మాములు అంచనాల్లేవు. ఒక తెలుగు సినిమా రిలీజవుతుందంటే ఏ రేంజ్లో హంగామా ఉంటుందో లియోపై కూడా అదే స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం. అందులోనూ LCUలో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుందంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. ఎలాగో విజయ్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. దానికి లోకేష్ తోడవడంతో బజ్ దానంతట అదే వచ్చింది.
కాగా తాజాగా ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ చూశాడు. అనంతరం సినిమా గురించి ఓ ట్వీట్ చేశాడు. సినిమా అద్భుతంగా ఉందని, లోకేష్ కనగరాజ్ టేకింగ్ ఎక్సల్లెంట్గా ఉందని, విజయ్ టెర్రిఫిక్‌గా పర్ఫార్మ్ చేశాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా చివర్లో LCU అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చాడు. దాంతో లియో సినిమా లోకేష్ సినిమాటిక్ యూనిఫర్స్లో భాగమే అని క్లారిటీ వచ్చేసింది. ఇంకేముంది సినీ లవర్స్‌లో ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఒక్కసారిగి రెట్టింపు అయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని కళ్లలో వత్తులు వేసుకుంటూ ఎదురు చూస్తున్నారు.
Thalabathy @actorvijay Anna’s #Leo 👍🏽👍🏽 👍🏽@Dir_Lokesh excellent filmmaking , @anirudhofficial music , @anbariv master @7screenstudio 👏👏👏#LCU 😉! All the best team !
— Udhay (@Udhaystalin) October 17, 2023
కమల్ హాసన్‌తో విక్రమ్ తీసి తమిళనాట ఇండస్ట్రీ హిట్ కొట్టిన లోకేష్.. ఇప్పుడు విజయ్‌తో ఇంకెలాంటి విధ్వంసాలు చూపిస్తాడో అని అందరిలో అమితాసక్తి నెలకొంది. ఇప్పటికే బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తుంది. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్.