Sivakarthikeyan | తమిళ హీరోలకు టాలీవుడ్ అంటే ఎప్పుడు ఇష్టమే. ఇక్కడ మార్కెట్ వస్తే వాళ్ల బిజినెస్ మరింత పెరుగుతుంది. అందుకే ప్రతి హీరో తెలుగు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు శివ కార్తికేయన్ కూడా ఇదే చేస్తున్నాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈయన నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతుంది. తాజాగా సంక్రాంతికి అరడజన్ సినిమాలు విడుదలవుతున్న కూడా తన అయలాన్ సినిమాను తీసుకొస్తున్నాడు శివ కార్తికేయన్. సౌత్ ఇండస్ట్రీలో మొట్టమొదటి ఏలియన్ కాన్సెప్ట్ సినిమా ఇది. దాంతో కచ్చితంగా తన సినిమాకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని నమ్ముతున్నాడు ఈయన. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. శివ కార్తికేయన్ మొదటి పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పంపిణీ చేస్తోంది.
కొన్నేళ్లుగా తెలుగులో శివ కార్తికేయన్ సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. వరుణ్ డాక్టర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత ప్రిన్స్ సినిమాతోనూ పర్లేదు అనిపించాడు. మొన్న విడుదలైన మహావీరుడు సినిమాకు కూడా తెలుగులో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘అయలాన్’ సినిమాతో వస్తున్నాడు. అయలాన్ అంటే ‘ఏలియన్’ అని అర్థం. సంక్రాంతికి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది ఒక్క మాటలో చెప్పాలంటే… ‘అయలాన్’ టీజర్ ఒక విజువల్ గ్రాండియర్. రెండు నిమిషాల వ్యవధిలో కథను చెప్పడంతో పాటు ఎంత లావిష్, రిచ్‌గా సినిమా తీశారనేది చూపించారు.
భూమి మీద వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడం, ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్ల గుడ్లు తవ్వకాల్లో బయట పడటం వంటివి చూపించి కథపై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. శివ కార్తికేయన్ ఎంట్రీతో ఆసక్తి మరింత పెరిగింది. ప్రపంచాన్ని ఓ ఎనర్జీతో శాసించాలని శరద్ కేల్కర్ ప్రయత్నించడం, అతడిని ఎదుర్కోవడానికి సామాన్య యువకుడు ఏం చేశాడు? హీరో – ఏలియన్ మధ్య స్నేహం వల్ల ఏం జరిగింది? భూమి మీద ఏలియన్ ఏం చేసింది? ఇషా కొప్పికర్ గన్ పట్టుకుని ఏలియన్‌ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? అనేది స్క్రీన్ మీద చూడాలి.