బిగ్‌బాస్ ఐదో వారం నామినేషన్స్‌లో 8 మంది.. డేంజర్ జోన్లో ఆ నలుగురు..
Bigg Boss 6 Telugu Nominations List | బిగ్‌బాస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు.. అప్పటివరకు కలిసి ఉన్నవాళ్లే కెమెరా ముందుకు వచ్చి కలబడతారు. ఎందుకంటే నామినేషన్స్ డే అంటే ఆ మాత్రం ఫైర్ ఉండాల్సిందే అంటారు వాళ్లు. ఈ వారం కూడా నామినేషన్స్ వాడి వేడిగా జరిగాయి.
Bigg Boss 6 Telugu Fifth Week Nominations List | బిగ్‌బాస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు.. అప్పటివరకు కలిసి ఉన్నవాళ్లే కెమెరా ముందుకు వచ్చి కలబడతారు. ఎందుకంటే నామినేషన్స్ డే అంటే ఆ మాత్రం ఫైర్ ఉండాల్సిందే అంటారు వాళ్లు. ఈ వారం కూడా నామినేషన్స్ వాడి వేడిగా జరిగాయి. ఇప్పటికే ఇంటి నుంచి షాని, అభినయ శ్రీ, నేహా, ఆరోహి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారం ఎవరు బయటకు వస్తారు అనేది అందరిలోనూ ఆసక్తిగా ఉంది. ఈ వారం నామినేషన్స్‌లోకి 8 మంది కంటెస్టెంట్స్ వచ్చారు.
ఏ వారానికి ఆ వారం కొత్త కొత్తగా నామినేషన్స్ ప్లాన్ చేసే బిగ్ బాస్.. ఈ వారం కూడా సరికొత్తగా ప్లాన్ చేసి ఒకరితో ఒకరికి లింకు పెట్టి వదిలేశాడు. మరీ ముఖ్యంగా ఇంట్లో ఎవరెవరికి పడదు అని తెలుసుకొని.. వాళ్ల మధ్య నామినేషన్స్ పెట్టాడు బిగ్‌బాస్. మొదటి వారం నుంచి కొట్టుకొని చస్తున్న కొందరు కంటెస్టెంట్స్‌ను టార్గెట్‌గా చేసుకొని.. వాళ్ల మధ్య నామినేషన్స్ అనే మంట రగిలించాడు. మీలో మీరు తన్నుకు చావండి.. నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉంది ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ పరిస్థితి. ఇద్దరు కంటెస్టెంట్స్ ను పిలిచి వాళ్ల చేతులకు బేడీలు వేసి.. ఎందుకు ఈ వారం నామినేట్ అవ్వకూడదు వివరణ ఇవ్వాలని కోరాడు బిగ్‌బాస్.
అందులో భాగంగానే ముందు నుంచి ఒకరంటే ఒకరికి పడని శ్రీహాన్- ఇనాయ సుల్తానా.. చలాకి చంటి- గీతూ.. రేవంత్ – ఆది రెడ్డి లాంటి వాళ్లను జత చేశాడు. వీళ్లందరూ గంటల తరబడి చర్చించుకొని ఈ వారం ఎవరు నామినేట్ అవ్వాలి.. ఎవరు సేఫ్ అవ్వాలి అనేది బిగ్ బాస్‌కు తర్వాత చెప్పారు. ఈ లిస్టు ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకి చంటి, జబర్దస్త్ ఫైమా, వాసంతి, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో అందరికంటే వీక్ కంటెస్టెంట్ మెరీనా. ఈమెతో పాటు వాసంతి, అర్జున్ కళ్యాణ్ కూడా కాస్త డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇనాయా సుల్తానా డేంజర్ జోన్ లోనే ఉంది. కాకపోతే ఈ అమ్మాయి ఇంట్లో ఉంటే కచ్చితంగా గొడవలు జరుగుతాయని ఎలిమినేట్ చేయకుండా ఉంచే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ సేఫ్ జోన్ లో ఉన్నారు. దాంతో చూడాలి.. ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతారు అనేది.
Read More :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

