Klinkaara | రామ్ చరణ్, ఉపాసన ముద్దుల గారాల పట్టి క్లింకార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 2023 జూన్ 20న క్లింకార జన్మించగా, ఆ సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున పండగలే జరిపారు. క్లింకార పుట్టగానే మెగా ఇంట పట్టలేని సంతోషం కనబడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనల మొదటి బిడ్డగా, మెగా వారసురాలిగా క్లింకార జన్మించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే క్లింకార పుట్టినప్పటి నుండి ఆ చిన్నారి ఫేస్ ఎలా ఉందో చూడాలని మెగా ఫ్యాన్స్ ఆరాటపడుతూనే ఉన్నారు. కాని క్లింకార ఏ ఫొటో షేర్ చేసిన కూడా అందులో క్లింకార ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
మెగా మనవరాలిగా, వారసురాలిగా క్లింకార ఇప్పటికే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. చిన్నారికి క్లింకార అనే పేర పెట్టడం వెక కూడా ప్రత్యేకత ఉంది. ప్రపంచం మొత్తానికి శక్తిని ప్రసాదించే అమ్మవారి సహస్రనామాల్లో క్లిన్ కారా ఒకటి కాగా, అమ్మవారి అసమాన శక్తికి ఈ పదం అద్దం పడుతుంది. అపారమైన శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుందనడానికి నిదర్శనంగా లలిత సహస్ర నామాల్లో క్లిన్ కారా అనే పేరును ఉపయోగిస్తారు. అంతటి గొప్ప పేరును మోగా ప్రినెన్స్ కు నామకరణం చేయడం విశేషం. కొణిదెల క్లింకార అనే పేరు ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది.
అయితే తాజాగా మెగా కోడలు ఉపాసన తన ఇంట్లో ఉగాది పండగ వేడుకలకి సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ఉపాసన, క్లింకార, సురేఖలు పూజ మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు కనిపించింది. అయితే ఇందులో క్లింకార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారిని ఫేస్‌ని లవ్ ఎమోజీతో కవర్ చేసిన కూడా సైడ్ యాంగిల్లో కాస్త కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బేబి పింక్ డ్రెస్ ధరించి పద్ధతిగా పూజలో కూర్చున్న క్లింకార ఫోటోలని నెటిజన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.