Kisi ka Bhai Kisi Ki Jaan Trailer | దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి గతేడాది సల్మాన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ ముందటి ఏడాది రెండు సినిమాలు విడుదల కాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని రెండు సినిమాలతో అభిమానులలో ఉత్సాహం నింపడానికి రెడీ అయ్యాడు. సల్మాన్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ట్రైలర్ తోనే సినిమాపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైలెన్స్ కు దగ్గరగా ఉండే హీరో, వైలెన్స్ అంటే పడని హీరోయిన్ అన్నయ్య. ప్రేమించిన అమ్మాయి కోసం హీరోయిన్ అన్నయ్యను ఇంప్రెస్ చేయడం. అప్పుడే హీరోయిన్ ఫ్యామిలీను చంపాలని చూసే విలన్. వాళ్లని హీరో ఎలా అడ్డుకున్నాడు. వైలెన్స్ నచ్చని హీరోయిన్ అన్నయ్య.. హీరోను ఇష్టపడ్డాడా? అనేది కథ. హీరోయిన్ అన్నయ్యగా వెంకటేష్, ఆయన భార్యగా భూమిక నటించింది. ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు నటించాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వీరమ్ సినిమాకు రీమేక్. ఇదే సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా రీమేక్ చేశాడు.
ట్రైలర్ ను గమనిస్తే కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. తమిళంలో హీరోయిన్ ఫాదర్ పాత్రను హిందీలో అన్నయ్యగా మార్పు చేశారు. యాక్షన్ సీన్స్ కూడా పుష్కలంగా దట్టించినట్లు స్పష్టం అవుతుంది. అయితే కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం మితిమీరినట్లు తెలుస్తుంది. ఒక్క గుద్దుకే బిల్డింగ్ పడిపోవడం, ట్రైన్ లో ఫైట్ సీన్ కాస్త అతిగా అనిపించింది. అయితే సల్మాన్ అభిమానులకు మాత్రం ఈ సినిమా పండగలానే కనిస్తుంది. సల్మాన్ ఈ సినిమాను స్వంత బ్యానర్లో నిర్మించాడు.