కిరణ్, అలేఖ్యరెడ్డి, అక్సఖాన్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన సందేశాత్మక యాక్షన్ మూవీ ‘RK దీక్ష’. ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. సీనియర్ నటుడు సుమన్ ట్రైలర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది.
తప్పకుండా గొప్ప విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం.’ అని దర్శక,నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ ఆశాభావం వెలిబుచ్చారు. పట్టుదల, దీక్ష మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుందని చెప్పే సినిమా ఇదని హీరోయిన్ అక్స ఖాన్ తెలిపారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్‌శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజుకిరణ్, నిర్మాణం: ఆర్.కె.ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్.