Kiran Abbavaram | టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘క’ (KA). ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ శ్రీమతి రహస్య గోరక్ పర్యవేక్షిస్తున్నారు. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. టైం ట్రావెల్ కథతో ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇదిలావుంటే తాజాగా ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ టీం నుంచి ఫొటోను పంచుకున్నారు. దీంతో ఈ మూవీని అక్టోబర్ చివరి వారంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ఈ సినిమాలో ఆయ్ చిత్రం ఫేం నయన్ సారిక సత్యభామ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మాన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Kiran Abbavaram’s #KA releasing during the last week of October. Shoot wrapped up. pic.twitter.com/oP75v1d3oY
— Aakashavaani (@TheAakashavaani) September 24, 2024