‘క’ ఘన విజయం తర్వాత కిరణ్ అబ్బవరం నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. విశ్వ కరుణ్ దర్శకుడు. రవి, జోజో జోస్, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జనవరి 3న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్టు వారు తెలిపారు. ‘క’ విజయంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని, దానికి తగ్గట్టే సినిమా ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: డానియేల్ విశ్వాస్, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణం: శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిల్మ్స్.