కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘K-ర్యాంప్’. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మాతలు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానున్నందున మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఓనమ్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ని విడుదల చేశారు.
ఇది కేరళ నేపథ్యంలో జరిగే కథ అని, కేరళ అందాలు ఈ కథలో అద్భుతంగా ఆవిష్కృతం కానున్నాయని, ఓనమ్ పండుగ నేపథ్యంలో సాగే పాటను కూడా ఇందులో ప్రత్యేకంగా చిత్రీకరించామని మేకర్స్ తెలిపారు. నరేశ్, సాయికుమార్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌రెడ్డి మాసం, సంగీతం: చేతన్ భరద్వాజ్, నిర్మాణం: హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్.