‘క’ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. దాదాపు 50కోట్లకుపైగా వసూళ్లతో ఈ సినిమా ఆయన కెరీర్‌కు పెద్ద బ్రేక్‌నిచ్చింది. ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమతున్నారు. ‘కేఏ 10’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం పాత్ర వినూత్న పంథాలో ఉంటుందని, ఆయన సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కొత్త లుక్‌తో కూడిన స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా తాలూకు పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.