Kiran Abbavaram | ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రుబా’ (Dilruba). ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి టీజర్(Dilruba Offical Teaser)ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే.. కిరణ్ అబ్బవరం న్యూ ఏజ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. నాని కృష్ణార్జున యుద్ధం సినిమా ఫేం రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. మరోవైపు ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
గతేడాది క సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే దిల్రుబాను విడుదలకు సిద్ధం చేసిన ఈ కుర్ర హీరో ఆ తర్వాత ‘క’ సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.