GV Prakash Kumar | ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్స్టన్’ (Kingston). ఈ సినిమాలో దివ్య భారతి (Divyabharathi) హీరోయిన్గా నటించగా.. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించాడు. సీ ఫాంటసీ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 07న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ సినిమా ఏప్రిల్ 13 నుంచి తెలుగుతో పాటు తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తమిళనాడులోని సముద్ర తీర గ్రామం అయిన తూవత్తూర్‌లో జరుగుతుంది. 1982లో జరిగిన ఒక సంఘటన ఆ గ్రామం జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మత్స్యకారులుగా జీవనం సాగించే గ్రామస్థులు సముద్రంలోకి వెళితే, శవాలుగా తిరిగి వస్తుంటారు. దీనికి కారణం ఆత్మలేనని గ్రామస్థులంతా నమ్ముతారు. దీంతో ఎవరూ సముద్రంలోకి వెళ్లేందుకు సాహసించరు.
దీంతో తీరాన్ని మూసివేయడంతో గ్రామస్థులు క్రమంగా జీవనోపాధిని కోల్పోతారు.
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని, ఒక ముఠా గ్రామ యువకులను ఉపాధి పేరుతో తమ అక్రమ కార్యకలాపాల్లోకి లాగుతుంది. కింగ్స్టన్ అలియాస్ కింగ్ (జీవీ ప్రకాశ్‌కుమార్)తో సహా కొంతమంది యువకులు ఆ ముఠాలో చేరి పని చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ముఠా అక్రమ వ్యవహారాలు బయటపడతాయి. దీంతో కింగ్స్టన్ ఆ ముఠాకు వ్యతిరేకంగా నిలిచి, తిరిగి గ్రామానికి వస్తాడు. అయితే సముద్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కింగ్స్టన్ స్నేహితులతో కలిసి సముద్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఇక సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
The sea calls. He answers! 🌊 🧟 #Kingston Arrives on 13th April! ⛵
India’s First Marine Fantasy Blockbuster #Kingston Premiering on OTT & TV on April 13th 12pm!#KingstonFromApril13thOnZEE5@gvprakash @storyteller_kp @ZeeStudiosSouth @ParallelUniPic @divyabarti2801… pic.twitter.com/QRPHkXcy6W
— ZEE5 Tamil (@ZEE5Tamil) April 3, 2025