Kingdom of the Planet of the Apes | హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (Planet of the Apes ). చింపాజీ (Apes) కథాంశాలతో వచ్చిన ఈ చిత్రాలు వరల్డ్ వైడ్ ఏ కాకుండా ఇండియాలో కూడా వసూళ్ల వర్షం కురింపించాయి. ఇక ఈ సిరీస్‌లో మొదట వచ్చిన కాన్క్వెస్ట్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్ 1972 (Conquest of the Planet of the Apes) అనే చిత్రం అప్పట్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఆ తరువాత దానికి సిరీస్‌గా 2011లో వచ్చిన ది రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్(The Rise of the Planet of the Apes) చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇక దీనికి కొనసాగింపుగా వచ్చిన డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్(Dawn of the Planet of the Apes), వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్(War for the Planet of the Apes) సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. అయితే దీని తర్వాత ఈ సిరీస్ నుంచి ఏ మూవీ రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ ఫ్రాంచైజ్ నుంచి దాదాపు ఏడు సంవత్సరాల తరువాత కొత్త మూవీ రాబోతుంది. ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (Kingdom of the Planet of the Apes ) అంటూ ఈ సినిమా రానుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ట్రైలర్ గమనిస్తే.. వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (War for the Planet of the Apes)లో సీజర్ (చింపాజీ) మరణించిన అనంతరం అతడి కొడుకు కార్నెలియస్ తన తండ్రి బాటలో నడుస్తూ.. మెరుగైనా సమాజాన్ని ఏర్పరచడానికి ప్రయాణిస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైనా సంఘటనలు ఏంటి అనేది స్టోరీ. ఇక ఈ సినిమాకు మేజ్ రన్నర్ ఫేమ్ వెస్ బాల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని 2024లో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.