Dulquer Salmaan Interview | కింగ్ ఆఫ్ కొత్త నా స్టైల్లో సాగే గ్యాంగ్‌స్టర్ సినిమా.. దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ
Dulquer Salmaan Interview | పాన్ ఇండియా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త (King Of Kotha). ఆగస్టు 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు దుల్కర్ సల్మాన్ . కింగ్ ఆఫ్ కొత్త విశేషాలు దుల్కర్ సల్మాన్ మాటల్లోనే..
Dulquer Salmaan Interview | పాన్ ఇండియా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త (King Of Kotha). కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు దుల్కర్ సల్మాన్ . కింగ్ ఆఫ్ కొత్త విశేషాలు దుల్కర్ సల్మాన్ మాటల్లోనే..
మీ మొదటి గ్యాంగ్ స్టర్ సినిమా ఇదే కదా..?
అవును.. నేనిప్పటివరకు ఏ గ్యాంగ్‌స్టర్ సినిమా చేయలేదు. ఇది నాకు పెద్ద సినిమా నా పెద్ద. కింగ్ ఆఫ్ కొత్త పాటలు, యాక్షన్ సీన్లు, ఫుట్‌బాల్ పోర్షన్లతోపాటు మరిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
కింగ్ ఆఫ్ కొత్తలో మీకు నచ్చిన అంశాలు..
కథ నాకు బాగా నచ్చింది. ఇది స్నేహానికి ప్రాధాన్యమిచ్చే సూపర్ గుడ్ గ్యాంగ్‌స్టర్ సినిమా. ప్రతీ పాత్ర సినిమా కథనంపై ప్రభావం చూపిస్తుంది. హ్యూమన్ డ్రామా, సంఘర్షణను కథలో చాలా క్లీన్‌గా చూపించడం జరిగింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. రెండు టైం పీరియడ్స్‌లో జరిగే కథ ఇది.
గ్యాంగ్ స్టర్ జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి.. మరి కింగ్ ఆఫ్ కొత్త ఎలా ఉండబోతుంది.
ఇది నా స్టైల్లో సాగే గ్యాంగ్‌స్టర్ సినిమా. మంచి కథ, స్క్రీన్‌ప్లేతో టాలెంటెడ్ యాక్టర్లు, అందమైన సంగీతం, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపి ఉండే సినిమా. ప్రతీ పాత్ర సినిమా గతిని మార్చేలా ఉంటుంది. సినిమాలో నాకు నచ్చిన పాయింట్ ఇదే.
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదేనా..?
డైరెక్టర్ నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం సినిమా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాం. ఫైనల్‌గా మంచి కథ దొరికింది. సాధారణంగా నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తుంటా. కానీ ఈ సినిమాకు ఏడాదికంటే ఎక్కువే సమయం తీసుకున్నా. ప్రేక్షకులను మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు సినిమా చేశాం. మేము భారీ స్థాయిలో, హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో చేసిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం పక్కా అని చెప్పగలను.
సీతారామం తర్వాత మరిన్ని తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నారా..?
స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడమంటే ఇష్టం. ప్రస్తుతం లక్కీ భాస్కర్ టైటిల్‌తో తెలుగు సినిమా చేస్తున్నా. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. పలు కథలను కూడా వింటున్నా.
మణిరత్నం, బాల్కి లాంటి సీనియర్ డైరెక్టర్లతో పనిచేశారు.. కొత్త దర్శకులతో పనిచేయడం ఎలా ఉంది..?
అందరూ దర్శకులతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తా. కొన్నిసార్లు కొత్త డైరెక్టర్లు యూనిక్ ఐడియాలతో వస్తుంటారు. ఏదో ఒక పెద్ద అఛీవ్మెంట్ కోసం ప్రయత్నిస్తారు. ఇక సీనియర్ దర్శకులు మాకు చాలా విషయాలు నేర్పిస్తారు. కానీ నేను మాత్రం భిన్నమైన కథలను ఎంపిక చేయడంపైనే ఫోకస్ పెడతా. కంటెంట్ బలంగా ఉంటే మంచి సినిమా అవుతుందని నమ్మే వ్యక్తిని నేను.
ప్రాజెక్ట్ Kలో కనిపిస్తారా..?
ప్రాజెక్ట్ Kకు సంబంధించిన ప్రశ్నలను పక్కను పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా. దీనికి సంబంధించి ఏదైనా చిత్రనిర్మాణ సంస్థ తెలియజేస్తుంది. కానీ ప్రాజెక్ట్ K మాత్రం భారతీయ సినిమా స్థితిగతులను మారుస్తుందని అందరికీ చెబుతున్నా. ఇప్పటివరకు చాలా సినిమాలు చూశా.. కానీ ప్రాజెక్ట్ K లాంటి సినిమాను ఎవరూ ప్రయత్నించలేదు.
కింగ్ ఆఫ్ కొత్త ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

