‘కింగ్ బుద్ధ’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా 100 భాషలకుపైగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు చిత్ర దర్శకుడు, నిర్మాత సత్యారెడ్డి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ వేడుకలో ‘కింగ్ బుద్ధ వీ వాంట్ వరల్డ్ పీస్’ అనే టైటిల్సాంగ్ను శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ మంత్రి డాక్టర్ సునీల్ సేనేని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ సినిమా ద్వారా ప్రపంచశాంతి కోసం సత్యారెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. శ్రీలంకలో ఈ సినిమా షూటింగ్కు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. గౌతమబుద్ధుడి జననం, బాల్యం, విద్యాభ్యాసానికి సంబంధించిన సన్నివేశాలను నేపాల్లోని హిమాలయాలు, లుంబిని, ఖట్మాండు ప్రాంతాల్లో త్వరలో తెరకెక్కించబోతున్నామని దర్శకనిర్మాత సత్యారెడ్డి తెలిపారు.