డైరెక్షన్‌కి పదేళ్లపాటు దూరంగా ఉన్న ఎస్.జె. సూర్య ఎట్టకేలకు మళ్లీ మెగాఫోన్ పట్టారు. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ‘కిల్లర్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీగోకుల్ మూవీస్, ఎస్.జె.సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండటం విశేషం.
దీన్నిబట్టి ఈ సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్.జె.సూర్య, రెహమాన్ కాంబినేషన్లో ఇది అయిదవ చిత్రం కావడం గమనార్హం. అన్ని భాషలవారికీ కనెక్టయ్యే కథతో ప్రస్టేజియస్‌గా ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నామని, అయిదు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు వి.సి.ప్రవీణ్, బైజు గోపాలన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణమూర్తి.