Kiara Advani | బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్ సినీ జనాలు సోషల్ మీడియాలో ఎక్కువగా జపం చేస్తుండే పేరు కియారా అద్వానీ (Kiara Advani). తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కియారా అద్వానీకి నెట్టింట క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామ ఆన్లైన్లో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు నెటిజన్లు తమ పనులన్నీ పక్కన పెట్టేసి ఎగబడి చూస్తుంటారు. నెట్టింట ఎప్పటికపుడు కొత్త కొత్తగా కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటుంది కియారా అద్వానీ.
ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీబిజీగా ఉండే ఈ భామ తాజాగా దీపావళి (Diwali Celebrations) మూడ్‌లోకి వెళ్లిపోయింది. తన భర్త సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra)తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంది. ఈ ఇద్దరూ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోతూ.. స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కియారా-సిద్దార్థ్ అండ్ టీం సెల్ఫీలు దిగింది. ఈ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ ఏడాది సత్య కీ ప్రేమ్ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కియారా.
ఈ భామ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులున్నాయి. కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో YRF Spy Universe బ్యానర్లో తెరకెక్కుతున్న చిత్రం వార్ 2లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ తెరకెక్కని సినిమాగా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. వార్ 2 షూటింగ్ ఇటీవలే స్పెయిన్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 2025 జనవరి 24న విడుదల కానుంది.
Kiara Advani 1
Kiara Advani2
Kiara Advani3