సినీ పరిశ్రమకు ఎంతోమంది హీరోలను, స్టార్ కిడ్స్ను పరిచయం చేశాడు దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar). మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ క్రేజీ ఫిల్మ్‌మేకర్ నేడు 50వ పడి (50th birthday)లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు. బీటౌన్ సెలబ్రిటీలు సిద్దార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ (Varun Dhawan), కియారా అద్వానీ (Kiara Advani), అర్జున్ కపూర్ సహా ఇండస్ట్రీకి చెందిన స్నేహితులు, సన్నిహితులు కరణ్ జోహార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ సినిమా షూటింగ్ లొకేషన్లో కియారా, వరుణ్ ధావన్ హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ పాట పాడి కరణ్‌కు విషెస్ తెలియజేశారు.
తన గురువు కరణ్ జోహార్‌కు సిద్దార్థ్ మల్హోత్రా స్పెషల్ విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే కరణ్ జోహార్. మీ మంచి మనస్సు, నవ్వించే స్వభావం మీరు ఎవర్ గ్రీన్లా ఉండేలా చేసింది. మీరు చాలా స్పెషల్. నా జీవితంతో ఎప్పుడూ సంతోషం ఉండేలా చేసిన మీకు ధన్యవాదాలు..కొండంత ప్రేమతో అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 2012లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సిద్దార్థ్ మల్హోత్రాను హిందీ చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు కరణ్ జోహార్.
మరోవైపు అనన్యపాండే, జాన్వీకపూర్, విక్కీ కౌశల్, అర్జున్ కపూర్, కత్రినాకైఫ్, అలియాభట్, అర్పితాఖాన్ శర్మ, అనుష్కా శర్మ, మనీశ్ మల్హోత్రా, కరీనాకపూర్, కరీష్మా కపూర్‌తోపాటు చాలా మంది సెలబ్రిటీలు కరణ్ జోహార్‌కు విషెస్ చెబుతూ..అతనితో దిగిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసుకున్నారు.