బాలీవుడ్ (Bollywood) భామల్లో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లు కొద్ది మందే ఉంటారు. వారిలో లీడింగ్ పొజిషన్లో ఉంటుంది కియారా అద్వానీ (Kiara Advani). ఈ భామ నెట్టింట పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమా అప్డేట్ అయినా..సోషల్ మీడియా అప్డేట్ అయినా అందించడంలో చురుకుగా ఉంటుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra )తో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతుందని సినీ జనాలకు తెలిసిన విషయమే.
సిద్, కియారా టైం దొరికితే చాలు ఏదో ఒక వెకేషన్‌కు వెళ్తుంటారు. వీరిద్దరూ కనిపించారంటే కెమెరాలన్నీ వారివైపుకు తిప్పుకోవాల్సిందే. కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ బీటౌన్ సెలబ్రిటీలు తమ రిలేషన్ షిప్ మ్యాటర్‌ను త్వరలోనే అధికారికంగా బయటపెట్టేందుకు రెడీ అవుతున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఇద్దరు తమ రిలేషన్ షిప్‌ను ప్రకటించబోతున్నారని ముంబై మీడియాలో కథనం రావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇదే నిజమైతే వచ్చే ఏడాది ఈ ఇద్దరు పెళ్లి పీటలెక్కినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ తెగ గుసగుసలాడుకుంటున్నారు సినీజనాలు. సిద్దార్థ్ మల్హోత్రా షేర్షా సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుండగా..కియారా ప్రస్తుతం శంకర్ డైరెక్టర్ రాంచరణ్ నటిస్తోన్న చిత్రంలో ఫీ మేల్ లీడ్‌రోల్ పోషిస్తోంది.