Kiara Advani : విక్కీ కౌశల్, కత్రినా పెళ్లికి తనకు ఆహ్వానం అందలేదన్న కియారా.. కారణం అదేనా?
విక్కీ కౌశల్, కత్రినా పెళ్లికి తనకు ఆహ్వానం అందలేదన్న కియరా | బాలీవుడ్ సినీ ప్రేమ జంట.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్ 9న రాజస్థాన్‌లో
బాలీవుడ్ సినీ ప్రేమ జంట.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్ 9న రాజస్థాన్‌లో వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే.. ఈ పెళ్లికి ఎవరు వెళ్తారు? అనేదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. బాలీవుడ్ నుంచి చాలా మంది సెలబ్రిటీలు అయితే హాజరు అయ్యే అవకాశం ఉంది. ఓవైపు విక్కీ కౌశల్, మరో వైపు కత్రినా.. ఇద్దరూ తమకు ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉన్నవాళ్లను మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ముంబైలో విక్కీ కౌశల్, కత్రినా.. కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. ఇక.. తమ సంప్రదాయల ప్రకారం.. డిసెంబర్ 9న వివాహం జరగనుంది.
అయితే.. విక్కీ పెళ్లికి మిమ్మల్ని ఆహ్వానించారా? అని మీడియా కియారా అద్వానీని ప్రశ్నించగా.. నాకు విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఆహ్వానం అందలేదు. వాళ్ల పెళ్లి జరుగుతున్నట్టు నేను కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నాను. నన్నయితే తన పెళ్లికి పిలవలేదు.. అంటూ చెప్పుకొచ్చింది కియారా.
కియారా అద్వానీ.. లస్ట్ స్టోరీస్ అనే సినిమాలో విక్కీ కౌశల్‌తో కలిసి నటించింది. విక్కీ కౌశల్ చాలా మంచి వ్యక్తి. అతడితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ కియారా ఈసందర్భంగా మీడియాతో వెల్లడించింది.
విక్కీతో కియారా అద్వానీ ఇప్పటి వరకు లస్ట్ స్టోరీస్ సినిమాలో మాత్రమే నటించింది. తాజాగా గోవింద నామ్ మేరా అనే సినిమాలో కౌశల్ సరసన కియారా నటిస్తోంది.
కియారా, విక్కీ.. ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్‌గానే ఉన్నప్పటికీ.. విక్కీ కౌశల్ తన పెళ్లికి కియారాను పిలవకపోవడం వెనుక పెద్దగా కారణాలు లేకపోయినా.. తన పెళ్లికి చాలా తక్కువ మంది సెలబ్రిటీలను పిలిచినట్టు తెలుస్తోంది. తన పెళ్లి తర్వాత ముంబైలో మళ్లీ రిసెప్షన్ లాంటిది ఏర్పాటు చేసి.. బాలీవుడ్ సెలబ్రిటీలను అందరినీ పిలిచి పార్టీ ఇచ్చే చాన్స్ ఉందని బాలీవుడ్లో టాక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

