Khushi Movie Busniess | మరో కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఖుషీ సినిమాపై ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి హైపే ఉంది. గీతా గోవిందం తర్వాత విజయ్‌కు అలాంటి హిట్టు ఇదే అవుతుందని కథలు కథలుగా మాట్లాడేసుకుంటున్నారు. దానికి తగ్గట్లే ట్రైలర్లు పాటలు ఓ మత్తులా ఎక్కేశాయి. ఖుషీ పాటలు వినందే రోజు గడవదు అనేంతలా చాలా మంది అడిక్ట్ అయిపోయారు. కంటెంట్ మీదున్న నమ్మకమా మరేంటో తెలియదు కానీ మ్యూజికల్ కాన్సెర్ట్ తప్పితే మరో ఈవెంట్‌ను ప్లాన్ చేయలేదు. ఇక సమంత ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో విజయ్ ఒక్కడే దగ్గరుండి ప్రమోషన్లు చూసుకుంటున్నాడు. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ప్రమోషన్లు తిరిక లేకుండా జరుపుతున్నాడు.
ఇక తాజాగా ఈ సినిమా లెక్కలు బయటకు వచ్చాయి. ఖుషీ సినిమా బిజెనస్ రూ.56 కోట్లు దాటింది. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.110 కోట్ల రేంజ్లో గ్రాస్‌ను సాధించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా.. టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఖుషీ సినిమాకు రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. కాశ్మీర్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శఖుడు. విజయ్‌కు జోడీగా సామ్ నటిస్తుంది. వీళ్ల పేయిర్ చూడ ముచ్చటగాఉందని పోస్టర్లు, ట్రైలర్లు చూస్తేనే అర్థమయిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహద్ స్వరాలు సమకూర్చుతున్నాడు.