అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘కేసరి ఛాప్టర్-2’ ’ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ విజయవంతంగా ప్రదర్శింపబడుతూ మంచి వసూళ్లను సాధిస్తున్నది. తాజాగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నది.
కరణ్‌సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్.మాధవన్, అనన్యపాండే ముఖ్య పాత్రల్ని పోషించారు. ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జలియన్‌వాలాబాగ్ మారణహోమాన్ని కోర్టులో సవాలు చేసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాది సి.శంకరన్ నాయర్ జీవిత కథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిందీలో ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి.