Fahadh Faasil | చిక్కుల్లో ఆవేశం స్టార్..! ఫహద్ ఫాసిల్‌పై కేసు నమోదు చేసిన కేరళ మానవహక్కుల సంఘం..!
Fahadh Faasil | మలయాళ స్టార్ నటుడు, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ విలన్ ఫవాద్ ఫాసిల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదైంది. కేరళ మానవ హక్కుల సంఘం ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసింది.
Fahadh Faasil | మలయాళ స్టార్ నటుడు ఫవాద్ ఫాసిల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేరళ మానవ హక్కుల సంఘం ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇందుకు కారణం ఉన్నది. ఫవాద్ ఫాసిల్ ప్రస్తుతం ‘పింకేలీ’ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ షూటింగ్‌ను ఎర్నాకులంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారని.. దాంతో రోగులు ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తున్నది. రాత్రి సమయంలో షూటింగ్ జరిగిందని.. ఎమర్జెన్సీ వార్డులో షూటింగ్ చేసినట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమర్జెనీ రూమ్‌లో షూటింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారంటూ కమిషన్ సభ్యురాలు బీనా కుమారి వైద్యులపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు వైద్యులను వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది.
షూటింగ్ సమయంలో ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని సైతం ఆసుపత్రి లోపలికి తీసుకువెళ్లనివ్వలేదని ఆరోపణలు రాగా.. నిర్మాత సంఘం ఖండించింది. అయితే, షూటింగ్ వ్యవహారంపై సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం ‘పింకెలి’ మూవీని నిర్మిస్తున్న ఫహద్ ఫాసిల్‌పై కేసు నమోదైంది. ఫావాద్ ఫాసిల్ హీరో, విలన్ పాత్రతో సంబంధం లేకుండా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగులోనూ పలు సినిమాల్లో చేసినా.. ‘పుష్ప’లో భన్వర్ షింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ప్రస్తుతం పుష్ప-2 లోనూ నటిస్తున్నారు. ఇటీవల ఫహద్ ‘ఆవేశం’ మూవీతో తెలుగు అభిమానులను పలకరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకుపైగా కలెక్షన్‌ను రాబట్టింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఫవాద్ ఫాసిల్ నిర్మాతగానూ పలు సినిమాలను నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

