Keerthy Suresh | టాలీవుడ్ ప్రేక్షకులకు “నేను శైలజ” చిత్రం ద్వారా పరిచయమైన కీర్తి సురేష్, “మహానటి” సినిమా ద్వారా తన అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఆమెకు నేషనల్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. మహానటి పాత్రకి మరింత జీవం పోసేందుకు, సావిత్రి జీవితంలో ఉన్న మార్పులను ప్రతిబింబించేందుకు కీర్తి నిజంగానే కొంత బరువు పెరగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడిస్తూ, సినిమా పూర్తయ్యిన తర్వాత కూడా కొన్నాళ్లు బొద్దుగా ఉన్నానని తెలిపింది. “అప్పుడు షూటింగ్‌కి వెళ్లి, వచ్చి తినేసి నిద్రపోయేదానిని. ఆ అలవాటు కారణంగా కొద్దిగా లావయ్యాను” అంటూ ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. అయితే, ఈ జీవనశైలి ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తించిన కీర్తి, తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. కేవలం 9 నెలల్లోనే సుమారు 8 నుండి 9 కిలోల వరకు బరువు తగ్గిన ఆమె, దీని వెనుక ఉన్న రహస్యాన్ని కూడా చెప్పింది.
“రోజుకు కనీసం గంటసేపు కార్డియో చేస్తూ, సాధారణ డైట్ పాటించాను. అందులో ఎలాంటి క్రాష్ డైట్లు లేవు.. లైఫ్‌స్టైల్‌కి తగ్గట్టు ప్లాన్ చేసుకున్న డైట్ మాత్రమే,” అని కీర్తి వెల్లడించింది.కార్డియో వ్యాయామం చేయడం వలన దాని ప్రభావం కాళ్లు, ఛాతి, బ్యాక్‌పై పడుతుంది. ఈ వ్యాయామం వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేయడం వంటివి. కార్డియో వ్యాయామం ద్వారా కీర్తి సురేష్ బాగానే తగ్గింది. ప్రస్తుతం తక్కువ బరువుతో ఫిట్‌గా కనిపిస్తున్న కీర్తి సురేష్, తాను పెట్టిన కృషి ఫలించి ఫ్యాన్స్‌ను మళ్లీ ఆకట్టుకుంటోంది. ఆమె డెడికేషన్ ఇప్పుడు పలువురికి ఇన్స్పిరేషన్గా మారుతోంది.
కీర్తి సురేష్ తన కెరియర్లో నేను శైలజ చిత్రం తర్వాత నేను లోకల్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట, రంగ్ దే వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కీర్తి. ఇటీవలే ఉప్పు కప్పురంబు సినిమాతో హిట్టు అందుకుంది. .. గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే ఆమె ఓ చిత్రంలో వేశ్యగా కనిపించనుందంటూ ఇటీవల జోరుగా వార్తలు వచ్చాయి. దానిపై క్లారిటీ రాలేదు.