Keerthy Suresh | కీర్తి సురేశ్ చేస్తున్న చేయబోతున్న సినిమాలు నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివెడి సినిమాల్లో నటిస్తున్నది కీర్తి. ఈ మూడు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్లే కావడం విశేషం. అలాగే వరుణ్‌ధావన్ హీరోగా రూపొందుతోన్న ‘బాబీ జాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేయనుంది ఈ మహానటి ప్రస్తుతం చేస్తున్న సినిమాల వివరాలివి. తాజాగా తెలుగులో సుహాస్‌తో కలిసి నటిస్తున్నట్టు వార్తలు బలంగా వినిపించాయి.
అసలు ఇదేం కాంబినేషన్? కీర్తి ఎలా ఒప్పుకుంది? అంటూ నెటిజన్స్ స్టోరీలు కూడా రాసేస్తున్నారు. అదేగనుక నిజమైతే నిజంగా అది డేరింగ్ డెసిషనే. ఇక అసలు విషయానికొస్తే.. త్వరలో కీర్తి ఓ పాన్ ఇండియా సినిమాలో నటించనుందని విశ్వసనీయ సమాచారం. పైగా అందులో హీరో ప్రభాస్. అవును.. త్వరలో ఈ అందాలభామ ప్రభాస్‌తో జతకట్టనుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా ఎంపికైందట. సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని తెలిసింది. మొత్తంగా ప్రభాస్ నుంచి సుహాస్ దాకా.. కోలీవుడ్ నుండి పాన్ ఇండియా దాకా అంతా కవర్ చేసేస్తున్నది ఈ మహానటి.