అది నిజం కాదు
తన సినిమాపై సాంఘిక మాధ్యమంలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కథానాయిక కీర్తి సురేశ్ కౌంటరిచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా రూపొందుతున్న భారీ చిత్రంలో కీర్తి సురేశ్ ఓ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె వెంకటేష్ జోడీగా నటిస్తున్నది.
తన సినిమాపై సాంఘిక మాధ్యమంలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కథానాయిక కీర్తి సురేశ్ కౌంటరిచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా రూపొందుతున్న భారీ చిత్రంలో కీర్తి సురేశ్ ఓ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె వెంకటేష్ జోడీగా నటిస్తున్నది. ఈ సినిమా.. మలయాళంలో 2024లో వచ్చిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ చిత్రం రీమేక్‌గా తెరకెక్కుతున్నదని ఇన్‌స్టాలో ఎవరో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. దానికి కీర్తి సురేశ్ స్పందిస్తూ.. ‘అందులో ఏ మాత్రం నిజం లేదు.
ఇది కొత్త కథ. అందరూ మెచ్చే కథ’ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో వెంకీ, కల్యాణ్‌రామ్ చిత్రంపై వస్తున్న గాలి వార్తలకు చెక్ పెట్టినట్టయింది. రాయలసీమ నేపథ్యంలో, అనిల్ మార్క్ కామెడీతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈచిత్రానికి ‘జనవరి 13న విడుదల’ అనే టైటిల్‌ని కూడా అనుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

