Keeravani | సంగీత ప్రపంచంలో కీరవాణికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలకి తనదైన శైలిలో సంగీతం అందించి ప్రేక్షకులని ఎంతో ఉత్సాహపరిచారు. కీరవాణి వివాదాలకి చాలా దూరంగా ఉంటారు. కాని ఈ మధ్య ఆయనపై నెగెటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా సింగర్ ప్రవస్తి.. కీరవణాణి గురించి కొన్ని కామెంట్స్ చేయడంతో అతనిని కొందరు టార్గెట్ చేశారు. కీరవాణి పాత వీడియోలు బయటకు తీసి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ‘వీక్షణ’ అనే పేరుతో ఓ ప్రైవేట్ సాంగ్ ని హారిక నారయణ్ .. కీరవాణి చేతుల మీదుగా విడుదల చేయించింది. ఆ సమయంలో కీరవాణి సోఫాలో కూర్చొని ఉంటే, హారిక అంతసేపూ నిలబడే ఉంది.
దాంతో ఆమెని అంత సేపు అలా ఎలా నిలుబోబెడతావు అంటూ ట్రోల్ చేశారు. దానిపై హారిక వివరణ ఇచ్చింది. నేను ఆ వీడియోలో నిల్చుని ఉండటం అనేది పూర్తిగా నా ఛాయిస్. కీరవాణిని నేను గురువులా భావిస్తూ నేనిచ్చే మర్యాద అది. కీరవాణి దగ్గర పనిచేసే ఎవరిని అడిగినా ఆయన ఎలాంటి వారో.. ఆయన విలువలు ఎలాంటివో చెబుతారు అని చెప్పుకొచ్చింది. ఇక కీరవాణికి సంబంధించిన పాత వీడియో మరొకటి బయటకి తీసి నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. కీరవాణి ఒక సింగింగ్ షోలో క్రిస్టియన్ మతాన్ని పొగుడుతూ హిందూ మరియు ఇతర మతాలను అగౌరవపరిచేలా మాట్లాడడంటూ ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.
వీడియోలో కీరవాణి మాట్లాడుతూ..నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను. కానీ క్రిస్టియన్ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కేవలం ఈ మతం లో మాత్రమే క్షమించే తత్త్వం ఉంటుంది. మిగతా మతాల్లో అది కనిపించదు అన్నట్టుగా మాట్లాడాడు. దీంతో హిందూ మతానికి చెందిన గురువు కీరవాణిని ఏకి పారేస్తూ ఆయన సినిమాలు బ్యాన్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. కాగా, కీరవాణి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తో ‘విశ్వంభర’ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి ‘రామ రామ’ అనే పాట కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా ఆయన సంగీతం అందిస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి చిత్రానికి కూడా కీరవాణినే సంగీతం అందిస్తున్నాడు.