 
                                                            ‘అల్లూరి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది అస్సామీ సుందరి కయాదు లోహర్. అయితే ఆ సినిమా నిరాశపరడచంతో తమిళ, మలయాళ భాషలపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో విశ్వక్సేన్తో కలిసి ‘ఫంకీ’ చిత్రంలో నటిస్తున్నది.
తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ భామ బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. నాని ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఆమెను కథానాయికగా ఖరారు చేశారని సమాచారం. హైదరాబాద్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. జడల్ పాత్రలో నాని ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాల్ని పెంచింది.
కొంతకాలంగా కథానాయిక అన్వేషణలో ఉన్న చిత్రబృందం చివరకు కయాదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఈ భామ తెలుగులో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నదని, ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుందని అంటున్నారు. ‘ది ప్యారడైజ్’ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
 
                            