Nani | నేచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచుకున్నారు. ఇటీవలే ‘హిట్ 3’తో మంచి విజయాన్ని అందుకున్న నాని ప్యారడైజ్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇది విన్న నెటిజన్స్ కొందరు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తుంటే , మరి కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాతో యువతరాన్ని ఆకట్టుకున్న అందాల నటి కయాదు లోహర్ ఇప్పుడు నాని చిత్రంలో ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు. ఈ అస్సాం బ్యూటీ ఇప్పటికే కన్నడ, మలయాళ, మరాఠీ చిత్రాల్లో తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘అల్లూరి’ (శ్రీవిష్ణుతో కలిసి నటించిన చిత్రం) ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, టాలీవుడ్ మాత్రం ఆమెకు అడపాదడపా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.. తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న ఫంకీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఇక నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న ‘ప్యారడైజ్’ చిత్రంలో వేశ్య పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
చిత్రంలో ఈ భామ సెక్స్ వర్కర్ పాత్ర పోషిస్తుందని, ఇందులో స్కిన్ షోతో పాటు బోల్డ్‌గా కనిపించాల్సి ఉంటుందట. అయిన కూడా ఇష్టపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఆమె పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్. ఇక ఇప్పటికే ఈ భామ సెట్లో అడుగుపెట్టిందని, పలు కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం. అయితే కయాదు లోహర్ చేస్తున్న ఈ రిస్క్‌ని కొందరు అభినందిస్తుండగా, మరి కొందరు విమర్శిస్తున్నారు. ఇక ప్యారడైజ్ విషయానికి వస్తే వచ్చే ఏడాది మార్చి 26న చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.