Bloody Beggar | కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు కవిన్. ఈ స్టార్ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం బ్లడీ బెగ్గర్ (Bloody Beggar). శివ బాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. Filament Pictures బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లడీ బెగ్గర్ తమిళ్ వెర్షన్ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
కాగా తెలుగు వెర్షన్ విడుదలయ్యేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. బ్లడీ బెగ్గర్‌ను తెలుగులో నవంబర్ 7న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. జెన్ మార్టిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం నెల్సన్ దిలీప్‌కుమార్ తొలి ప్రొడక్షన్ వెంచర్ కావడం విశేషం.
Mark your calendars! #BloodyBeggar releasing in Telugu on November 7th 💥
AP/TG Release by @asiansureshent ✨@Kavin_m_0431 @afilmbysb @nelsondilpkumar @FivestarSenthil @KingsleyReddin @sujithsarang @JenMartinmusic @filamentpicture @thinkmusicindia @thinkstudiosind pic.twitter.com/r8OCSQFYtk
— Asian Suresh Entertainment (@asiansureshent) October 22, 2024
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్